శిర్డీ సాయిబాబా భద్రత పెంపు

-

షిర్డీలో జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. జులై 02 నుంచి జులై 04 వరకు జరిగే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు.. సంస్థాన్​ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజు సాయినాధుని సమాధి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు తెలిపారు.

శిర్డీ సాయిబాబా ఆలయానికి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ (ఎంఎస్ఎఫ్) అదనపు భద్రతను కల్పించింది. భద్రత కోసం 74 మంది ఎంఎస్ఎఫ్ జవాన్లు మోహరించారు. బాంబే హైకోర్టు అనుమతితో ఆలయ గభారా, ఐదు ప్రవేశ ద్వారాల వద్ద జవాన్లు రక్షణ కల్పిస్తారు. వీరితో పాటు వందమంది పోలీసులు క్యూ కాంప్లెక్స్, చెకింగ్ పాయింట్, ఆలయ పరిసరాల్లో విధులు నిర్వహిస్తారు. శిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సొంతగా మరో ఆరువందల మందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంది. వీరు కాంప్లెక్స్, ప్రసాదాలయం, భక్తి నివాస్ సహా వివిధ ప్రాంతాలలో ఉంటారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version