సంచలనం: మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్న మోదీ సర్కారు!

-

ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలను జరిపించడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుండగా కొన్ని సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి. అలా చూస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు అధికారం దక్కే ఛాన్సెస్ ఉన్నాయంటూ లోక్ పాల్ సర్వే ఫలితం చెబుతోంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉండగా కాంగ్రెస్ 120 నుండి 132 సీట్ల వరకు గెలుచుకుంటుందని, బీజేపీ 98 నుండి 110 సీట్లకు పరిమితం అవుతుందని, బీఎస్పీ రెండు చోట్ల మరియు ఇతరులకు కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అవుతాయని తెలిపింది.

ఈ సర్వే ఫలితం ప్రకారం అధికారంలో ఉన్న బీజేపీకి గెలుపు ఛాన్సెస్ తక్కువే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version