బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు..!!

-

ఒక పక్క బాలీవుడ్ సినిమాలు అన్నీ ప్లాప్ అవడం, సౌత్ ఇండియన్ సినిమా బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు  కేజీఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం వల్ల బాలీవుడ్లో అందరూ దక్షిణాది సినీ పరిశ్రమ ను అసూయగా చూడడం మొదలుపెట్టారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం కావడానికి సౌత్ లు కారణమంటూ ఇటీవల డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు ఆయన ఇలాంటి మాజిక్ లు ఒక్కసారే కనెక్ట్ అవుతాయి. మళ్లీ మళ్లీ తీస్తే మాత్రం ప్లాప్ అవుతాయి అని ఇదందా గాలి మహిమ అన్నట్లుగా మాట్లాడారు.దీనితో ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసూయ తోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ నెటిజన్స్ అనురాగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో  కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అనురాగ్ మాటలను తప్పుపట్టిన  వివేక్ ఆయనకు బుద్ది వచ్చేలా కామెంట్స్ చేసాడు.

ఇక తాజాగా ఈ విషయంపై హిందీ నటుడు , సింగర్ పియూశ్ మిశ్రా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ దర్శకుల కంటే సౌత్ డైరెక్టర్స్ చాలా తెలివైన వాళ్లు అని అన్నారు. మనకంటే వాళ్లు ఎక్కువ క్రియేటివిటీ ఉన్న వారని చెప్పారు. హిందీ పరిశ్రమలో ఉన్న అందరు దర్శకులు ఒకే రకంగా ఆలోచిస్తూ , ఒకే మూసలో సినిమాలు తీస్తూ వస్తున్నారు. అదే మా మూర్ఖత్వం అని అన్నారు పియూశ్ మిశ్రా. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version