ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించిన షారుక్ ఖాన్..!

-

బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే గత నాలుగు యేళ్ళ ల్లో ఈయనకు చెప్పుకోదగిన ఒక హిట్టు కూడా లేదు . కానీ ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ముఖ్యంగా ఆసియాలోని నటులందరిలో అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాదు జార్జ్ క్లూనీ, జాకీచాన్, టామ్ క్రూజ్ వంటి దిగ్గజ యాక్టర్స్ కంటే ముందు ఉండడం గమనార్హం. మొత్తానికి వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ జాబితాలో షారుఖ్ ఖాన్ 4వ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.

మరి షారుఖ్ ఆస్తుల విలువ ఎంత అనే విషయానికి వస్తే.. 770 మిలియన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.6వేల కోట్లకు పైమాటే…ఈ ఆస్తుల విషయంలో షారుక్ ఖాన్ పలువురు హాలీవుడ్ హీరోలను కూడా వెనక్కునేట్టేశారు. ఇక ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ జెర్రీ సైన్ ఫీల్డ్ రూ. 8 వేల కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో ఇండియా నుంచి స్థానం సంపాదించుకున్న నటులలో షారుఖ్ ఖాన్ మాత్రమే ఉండడం ఇప్పుడు పలువురిని ఆశ్చర్య పరుస్తోంది.

ఇక అమెరికాకు చెందిన టైలర్ పెర్రి వన్ బిలియన్ డాలర్ తో రెండవ స్థానంలో ఉండగా.. డ్వెన్ జాన్సన్ 800 మిలియన్ డాలర్ల ప్రాపర్టీతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక నాలుగవ స్థానంలో షారుక్ ఖాన్ ఉండగా.. టామ్ క్రూజ్, జాకీచాన్ తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంతో కలిసి పఠాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version