నియంత కేసీఆర్ ను తరిమికొట్టి..YSR పాలన తెస్తానని వైఎస్ షర్మిల అన్నారు. పాదాయత్రలో భాగంగా ఇవాళ మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఏజెన్సీ ఏరియాలను KCR పట్టించుకోవట్లేదని… తెలంగాణలో ఒక భాగమని కూడా గుర్తించట్లే.పోడు భూములకు పట్టాలియ్యకపోగా గిరిజనులు, ఆదివాసీలపై దాడులు చేయించి, ఉన్నభూముల్ని గుంజుకుంటున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
YSR గారు 3.3లక్షల ఎకరాలకు పోడు పట్టాలిస్తే పత్తా లేకుండా పోయిండని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల హామీని గాలికొదిలి, దళితబంధు పేరుతో కొత్తనాటకానికి తెరలేపాడని చురలకు అంటించారు. వాస్తవానికి దళితులకు KCR రూ.61లక్షల బాకీ ఉన్నాడన్నారు.
ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని రూ. 61లక్షలేవని అడగాలె.అధికారం ఉంది కదా అని ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులకు ఎకరాకు రూ.5వేలు ఇచ్చి,రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టిండు… కౌలు రైతులను మనుషులుగానైనా గుర్తించడం లేదని మండిపడ్డారు. KCR నియంత పాలనను తరిమికొట్టి YSR సంక్షేమ పాలనకు పట్టం కట్టాలె. అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూములకు పట్టాలిస్తామని స్ఫష్టం చేశారు.