కేసీఆర్..ఇండియాలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. రుణమాఫీ నుంచి దళితబంధు వరకు కేసీఆర్ వన్నీ మోసాలేనని.. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిండని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
తెలంగాణ సొమ్మును లూటీ చేసి, దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా ఎదిగిండని… హిడెన్ బర్గ్ మీద ఎలాగైతే చర్చ జరుగుతుందో.. కేసీఆర్ అవినీతి మీద కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మెగా కంపెనీకి 80శాతం ప్రాజెక్టులు కట్టబెట్టడంపై వెనకున్న రహస్యాలను ప్రజలకు చెప్పాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైయస్ఆర్ బిడ్డను అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వైయస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానని, వైయస్ఆర్ ప్రారంభించిన ప్రతి పథకాన్ని మీ చేతుల్లో పెడతానని మీకు మాటిస్తున్నానన్నారు వైఎస్ షర్మిల.