వైయస్ షర్మిల కారు డ్రైవర్ ను అరెస్ట్

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న నేపధ్యం లో కేసు నమోదు చేసి పోలీసులు, షర్మిల ను అరెస్ట్ చేసిన సంఘటన అందరికి తెలిసిందే. షర్మిల కారు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానిస్టేబుల్ కాలి పైకి కారు ఎక్కించిన కేసులో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో షుగర్ 502 వచ్చింది. కానిస్టేబుల్ గిరిబాబు కాలి పైకి కారు ఎక్కించడంతో కాలి లెగ్మెంట్ కు గాయమైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు .

YS Sharmila arrested after she 'assaults' cops in Hyderabad

ఈ కేసులో షర్మిలను ఏ 1గా, డ్రైవర్ బాలును ఏ2గా, మరో డ్రైవర్ జాకబ్ ను ఏ3గా నమోదు చేశారు పోలీసులు. బాలును ముందే అరెస్ట్ చేయగా, జాకబ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు అతనిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు . కాగా, పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిల పైన ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని నిర్ణయించారు షర్మిల.

 

 

Read more RELATED
Recommended to you

Latest news