నిరుద్యోగ మార్చ్’’కు తరలిరండి : బండి సంజయ్

-

ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో రేపు (ఈనెల 25న) జరగబోయే ‘‘నిరుద్యోగ మార్చ్‘‘ కు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబందించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతోపాటు ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం ఉమ్మడి పాలమూరు పరిధిలోని పోలింగ్ బూత్ ఇంఛార్జీలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నిరుద్యోగుల గొంతు కోస్తోంది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మాట మార్చి అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. 21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోంది. కేసీఆర్ కుటుంబమే ఈ లీకేజీపై ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేటు. పేపర్ లీకేజీకి ఐటీశాఖ నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయకపోగా, ఆయనను కాపాడుకోవడానికి సీఎం యత్నిస్తున్నారు.

Telangana: Bandi calls for a 'Nirudyoga March' in Warangal

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంటే.. సిట్ పేరుతో దోషులను కాపాడే యత్నం చేస్తున్నారు. సిట్ చేసిన విచారణలేవీ ఇంతవరకు అతీగతీ లేదు. నయీం ఆస్తులు, డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణమే ఇందుకు కారణం. ఈ విషయాలన్నీ తాము ప్రస్తావిస్తుంటే ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీక్ పేరుతో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయినప్పటికీ తాము భయపడలేదని, తనను ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడి నుండి నిరుద్యోగ మార్చ్ నిర్వహించి బీజేపీ సత్తా చూపారు. అందులో భాగంగానే పాలమూరులో రేపు నిర్వహించబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు ప్రతి ఒక్కరూ తరలి రావడంతోపాటు పెద్ద ఎత్తున యువతను మార్చ్ లో భాగస్వామ్యం చేయాలి. 30 లక్షల మంది యువత భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై సీఎం స్పందించి టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు ఐటీశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా బీజేపీ పోరాడుతుంది. పాలమూరులో జరగబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు తరలిరావాలంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేయాలన కోరుతున్నా.’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news