హుజూరాబాద్ పోరు: బరిలో షర్మిల పార్టీ?

-

ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనూహ్యంగా తెలంగాణ పాలిటిక్స్‌లోకి వచ్చిన షర్మిల(sharmila), కొత్త రాజకీయ పార్టీని పెట్టడానికి కూడా సిద్ధమవుతుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న ఆమె కొత్త పార్టీని ప్రకటించనుంది.

షర్మిల/sharmila

ఇక పార్టీ ప్రకటించక ముందు నుంచే షర్మిల, కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు మద్దతుగా మూడు రోజుల పాటు దీక్ష చేసిన షర్మిల రైతులకు మద్దతుగా ముఖ్యమంత్రి పైన విమర్శలు గుప్పించారు. ఇక, నీటి వివాదాల అంశంలో వ్యూహాత్మకంగా స్పందించారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ఉంటారని తెలుస్తోంది. పైగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని అంటున్నారు.

నెక్స్ట్ వచ్చేది రాజన్న రాజ్యమే అని చెబుతున్న షర్మిల, త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ తరుపున అభ్యర్ధిని నిలుపుతారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా సీక్రెట్‌గా సర్వే చేయించారని, దాదాపు 70 నియోజకవర్గాల్లో వైఎస్సార్ ఇమేజ్ ఉందని, అలాంటిచోట్ల షర్మిల పార్టీ సత్తా చాటుతుందని, ఆ పార్టీకి చెందినవారు చెబుతున్నారు.

అయితే ఆమె డైరక్ట్‌గా ప్రధాన ఎన్నికల్లోనే పోటీకి దిగుతారా? లేక హుజూరాబాద్ బరిలో తమ అభ్యర్ధిని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. పరిస్తితులని బట్టి అభ్యర్ధిని నిలబెట్టే ఛాన్స్ లేకపోలేదని, కానీ ఇప్పుడే పార్టీ ఏర్పాటు అయింది కాబట్టి, క్షేత్ర స్థాయిలో ఇంకా బలపడే వరకు షర్మిల పోటీ గురించి ఆలోచించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు బరిలో దిగిన పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version