అఫీషియల్: శివ కార్తీకేయన్-అనుదీప్ ‘ప్రిన్స్’ రిలీజ్ డేట్ లాక్‌డ్..

-

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. ఉక్రెయిన్ భామ మరియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

డైరెక్టర్ అనుదీప్ కేవీ, హీరో శివ కార్తీకేయన్ ఈ సినిమా విడుదల తేదీని వినూత్నంగా ప్రకటించారు. సినిమా విడుదల ఆలస్యమవుతున్నట్లు వస్తున్న వార్తలను ధ్రువీకరిస్తూనే నూతన విడుదల తేదీని చెప్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు.

డైరెక్టర్ అనుదీప్ తెలుగులో మాట్లాడుతుండగా శివకార్తీకేయన్ తమిళ్ లో ట్రాన్స్ లేట్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీలో ఆలస్యానికి కారణం సత్యరాజ్ అని కామెంట్స్ చేశారు. అంతలోనే సత్యరాజ్ ఎంట్రీ ఇవ్వడంతో కాదని మాట మార్చేశారు. హీరోయిన్ మరియా సైతం..ఈ వీడియోలో కనిపించింది.

ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ SLP, సురేశ్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

https://www.youtube.com/watch?v=GoA-0tHI_4k

Read more RELATED
Recommended to you

Latest news