ఆ విద్యార్థులు మళ్లీ ఇంటర్‌ ఫస్టియర్‌ చదవాల్సిందే!

-

తెలంగాణ విద్యార్థులకు షాకింగ్‌ న్యూస్‌ ఇది. ఏపీలో ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్‌ లైన్‌ లోనే ప్రవేశాలను ప్రారంభించారు. అయితే ఇంటర్‌ సెకెండ్‌ ఇయర్‌లో చేరాలనుకున్న కొందరు విద్యార్థులకు అధికారులు షాక్‌ ఇచ్చారు. వారు మళ్లీ ఫస్ట్‌ ఇయర్‌ చదవాలి అంటూ కండిషన్‌ పెట్టారు. ఆ వివరాలు తెలుసుకుందాం.


కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఈ ఏడాది అన్ని తరగతుల వారు పాస్‌ అయిపోయారు. అయితే, ప్రస్తుతం ఏపీలో ఇంటర్‌ ఆన్‌ లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్‌ ్త సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ∙తెలంగాణలో ఫస్టియర్‌ ఇంటర్‌ చదివిన విద్యార్థులు ఏపీలో సెకెండ్‌ ఇయర్‌ చదవాలి అనుకుంటే కుదరదు.. మళ్లీ వారు ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో ఇంటర్‌ చేయాలి అనుకున్న విద్యార్థులకు బ్యాడ్‌ న్యూస్‌ అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా పది పరీక్షలు పాసైన విద్యార్థులు ఇంటర్‌ లో చేరాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో ప్రవేశాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నా.. ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం అడిగిన మేర లక్షల్లో ఫీజు చెల్లించిన వారికే సీట్లు
కేటాయించేవి. కానీ ఇప్పుడు ఆన్‌ లైన్‌ అడ్మిషన్ల విధానం ప్రారంభమవడంతో ఈ సమస్యలు తీరినట్టే. విద్యార్థి మెరిట్‌ను బట్టి తనకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. కానీ, ఈ విధంగా తెలంగాణ విద్యార్థులకు కండిషన్‌ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version