గ్యాస్ మంట: వినియోగదారులకు షాక్..నేటి నుంచి పెరిగిన సిలిండర్ ధరలు..

-

దేశంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా ప్రధాన వస్తువుల పై ధరలు భారీగా పెరిగాయి..పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరో షాక్‌ తగిలింది.కొత్త కనెక్షన్ తీసుకోవాలి అనుకునేవారికి భారీ షాక్..నేటి నుంచి గ్యాస్ సిలిండర్ ఖరీధుగా మారింది.

 

LPG గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ల సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచిన తర్వాత, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ల రేట్లను కూడా పెంచాయి. ఇటీవల ప్రకటించిన ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ పెంపు ఈరోజు అంటే 28 జూన్ 2022 నుండి అమలులోకి వచ్చింది. కొత్త రేట్ల ప్రకారం.. ఇప్పుడు వినియోగదారులు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.1,050 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.2,550 నుంచి రూ.3,600కి పెంచాయి.

అంతేకాదు..47.5 కిలోల వాణిజ్య సిలిండర్ కనెక్షన్ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం కస్టమర్లు రూ.7,350 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రేట్ల ప్రకటనకు ముందు రూ.6,450గా ఉంది. ఇందులో ఒక్కో సిలిండర్‌పై రూ.900 పెరిగింది..మరోటి 19 కెజీల సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ కు 4,800 నుంచి రూ.5850కి పెంచారు. అదేవిధంగా 47.5 కిలోల వాల్వ్ లాట్ వాల్వ్‌పై సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ.8,700 నుంచి రూ.9,600కి పెంచారు..ఇవి సామన్యులకు బాంబ్ లాంటి వార్త అనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version