కొండా సురేఖ కి షాక్.. పరువు నష్టం దావా వేసిన నాగార్జున..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిన్నటి నుంచి వివాదం మొదలైన విషయం విధితమే. తెలంగాణ మంత్రి కొండ సురేఖ నిన్న కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సినీ ఇండస్ట్రీకి చెందిన నటి సమంత నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్  అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందినవారు కొండ సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలా ఇలాంటి భాష మాట్లాడడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు.

Nagarjuna

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. ఇవాళ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని.. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదంపై మరి కోర్టులో మంత్రి కొండా సురేఖ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version