తూర్పుగోదావరి జిల్లా : కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ లో తెలుగు దేశం పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ మేయర్ పై కౌన్సిల్ లో వైసీపీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మేయర్ పై అవిశ్వాసానికి అనుకూలంగా 36 ఓట్లు పోల్ కావడంతో అవిశ్వాసం నెగ్గింది.
మొదటి నంచి అనుకున్నట్లుగానే మేయర్ సుంకర పావని, మొదటి డిప్యూటీ మేయర్ సత్తిబాబు లను పదవుల నుంచి దించేశారు 33 మంది కార్పొరేటర్లు. దీంతో వై.సి.పి వేసిన వ్యూహం ఫలించింది. చివరి ఏడాది మేయర్ పదవి టి.డి.పి చేతిలో ఉండకూడదని వై.సి.పి వ్యూహం పన్నింది.
ఈ మేరకు టీడీపీ మేయర్ పై వైసీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఏకంగా 36 మంది కౌన్సిల్ సభ్యులు చేతులెత్తారు. దీంతో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని టీడీపీ పార్టీ కోల్పోయింది. ఇక ఈ ఓటింగ్ లో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి పాల్గొన్నారు.