షాక్: భార్యకు విడాకులు ఇవ్వబోతున్న విజయ్ దళపతి..అసలు విషయం ఏమిటంటే..?

-

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు ఎలా అయితే చోటు చేసుకుంటున్నాయో వరుస విడాకులు కూడా అలాగే జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎన్నో సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా కొనసాగినప్పటికీ కూడా విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు ఎప్పటికప్పుడు అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరొక జంట కూడా విడిపోవడానికి సిద్ధమవుతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. వారు ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇకపోతే విజయ్ అలాగే తన భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని ప్రస్తుతం వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తమిళ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. విజయ్ కి సంగీత వీరాభిమాని.. అతడినే ఏరికోరి మరి పెళ్లి చేసుకోవడానికి ఆమె ఎన్నో కష్టాలు పడింది. అలా ఇద్దరు ప్రేమించుకొని.. పెళ్లి చేసుకున్నారు. 22 సంవత్సరాలుగా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందా అంటూ వార్తలు వైరలవుతున్నాయి.

అయితే ఈ వార్తలు రావడానికి కారణం ఆమె వారసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడమే.. అంతేకాదు మొన్నామధ్య అట్లీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి కూడా విజయ్ ఒంటరిగా వెళ్ళాడు.. గత కొద్ది రోజులుగా ఆమె ఎక్కడ విజయ్ తో కనిపించకపోయేసరికి ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలను విజయ్ స్నేహితులు ఖండించారు. విజయ్ – సంగీత విడిపోలేదని, ప్రస్తుతం ఆమె అమెరికాలో పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది అని త్వరలోనే ఆమె అమెరికా నుంచి రానున్నట్లు కూడా తెలిపారు అంతేకాదు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి అంటూ కూడా వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version