‘TG 09 0001’ నెంబర్ కోసం ఓ వాహనదారుడు ఎంత చెల్లించారో తెలిస్తే షాకే..!

-

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్ ప్లేట్లను టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాలకు TGతో నిన్న రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. దీనికోసం రవాణా శాఖలో అధికారులు అందుకు అవసరమైన మార్పులు చేశారు.

అయితే.. తొలి రోజే వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆసక్తి చూపించారు. ఖైరతాబాద్లో నిర్వహించిన బిడ్డింగ్లో ‘TG 09 0001’ నెంబర్ కోసం రుద్ర రాజ్ రాజివ్ కుమార్ అనే వాహనదారుడు దాదాపు 9 లక్షల 61 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఒక్క ఖైరతాబాద్లోనే ఒక్కరోజులో రూ.30.49లక్షలు ఆదాయం వచ్చింది. ‘TG 09 0909’ అనే నంబర్ రూ.2.30లక్షలు పలికింది.ఇదివరకు టీఎస్ నంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలను టీజీగా మార్చే అవకాశం లేదని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేకపోవడంతో టీఎస్ వాహనాలు టీఎస్ పేరుతోనే కొనసాగుతాయి అని తెలిపారు. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version