Breaking : ఎక్కడికక్కడ నిలిచిపోయిన టాలీవుడ్‌ సినిమాలు..

-

తమ వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌లోని 24 విభాగాల్లో పనిచేసే కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. పెంచిన వేతనాలు అమలు చేస్తేనే పనుల్లోకి వస్తామని తేల్చిచెప్పారు సినీ కార్మికులు. అయితే.. కరోనాతో దెబ్బతిన్నామని ఇప్పుడు వేతనాలు పెంచలేమని నిర్మాతలు అంటున్నారు. దీంతో.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ కు మధ్య వివాదం ముదురుతోంది. దీంతో.. టాలీవుడ్ లో ఎక్కడికక్కడ షూటింగ్ లు నిలిచిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు చుట్టుప్రక్కల దాదాపు 28 సినిమాల షూటింగ్ నిలిచిపోయాయి. అయితే.. ఈ రోజు నుంచి ఎదావిధిగా షూటింగ్స్ లో పాల్గొనాలి అని తెలుగు పిలిం ఛాంబర్ కోరింది. లేని పక్షంలో అరు నెలల పాటు షూటింగ్స్ నిలిపి వేస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది.

Lyca Productions writes to Telugu Film Chamber

నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దు అని తెలుగు ఫిలిం ఛాంబర్ కోరింది. ఇదిలా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో వేతనాలు పెంచేంత వరకు షూటింగ్ లకు హాజరుకామని ఫెడరేషన్ సభ్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కన్నా 45 శాతం ఎక్కువ ఇవ్వాలి అని సినీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టా పోయేది నిర్మాతలే అని ఫెడరేషన్ సభ్యులు వ్యాఖ్యానించారు. వివాదానికి పరిష్కరించే దిశగా సినీ పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. అయితే.. భారీ బడ్జెట్‌ సినిమాల నుంచి చిన్నస్థాయి సినిమాల వరకు అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ వివాదం ఎక్కడకు పోయి ఆగుతుందో చూడాలి మరీ..

 

 

Read more RELATED
Recommended to you

Latest news