మీ ఆధార్, పాన్‌ కార్డు సేఫ్‌గా దాచుకోండి ఇలా!

-

మీ ఆధార్, పాన్‌కార్డును ఆన్‌లైన్‌లో ఇలా భద్రంగా దాచుకోండి. దీన్ని అసవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌ ఇప్పుడు చాలా ముఖ్యమైంది. పాన్‌కార్డు కూడా అంతే అవసరం. ఇంకా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లను మీరు భద్రంగా దాచిపెట్టారా? ఇంట్లో పెడితే మీరు ఎక్కడికైన వెళ్లినుపుడు మీకు అందుబాటులో ఉండవు. అయితే ఇటువంటి ముఖ్యమైన పత్రాలను దాచుకోవడం ఎలా? అనే చాలా మందిలో ప్రశ్న.


దీనికి కేంద్ర ప్రభుత్వం 2015 లో ఓ వర్చువల్‌ లాకర్‌ను ప్రారంభించింది. అదే డీజీ లాకర్‌. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ డిజిటల్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డిజీ లాకర్‌ ప్లాట్‌ఫామ్‌ రూపొందించింది. ఇందులో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ అన్నింటినీ భద్రంగా దాచుకోవచ్చు. పాన్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌తో పాటు మీ సర్టిఫికెట్లను కూడా ఇందులో దాచుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్‌ దాచుకోవాలంటే ముందుగా డిజీ లాకర్‌లో మీ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి.https//digilocker.gov.in వెబ్‌సైట్‌ లేదా డిజీ లాకర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.

దాంట్లో యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ ద్వారా అకౌంట్‌ క్రియేట్‌ చేసి, మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ దాచుకోవచ్చు. జేపీఈజీ, పీడీఎఫ్, పీఎన్‌ జీ లాంటి ఫార్మాట్‌లో మీ డాక్యుమెంట్స్‌ స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వం జారీ చేసే ఎలాంటి డాక్యుమెంట్స్‌ అయినా డీజీ లాకర్‌లోకి ట్రాన్‌ఫర్‌ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ లో డిజీలాకర్‌ యాప్‌లో డాక్యుమెంట్స్‌ అన్నీ సులువుగా యాక్సెస్‌ చేయవచ్చు. రైలులో ప్రయాణించేప్పుడు లేదా ఆర్‌టీఏ అధికారులు మీ వాహనాలను తనిఖీ చేసినప్పుడు మీ ఆధార్‌ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్‌ లాంటివి డిజీలాకర్‌లో చూపించడానికి వీలుపడుతుంది. మరో పద్ధతిలో మెయిల్‌లో లేదా ఎక్కడైనా ఆన్‌ లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ దాచుకోవడం భద్రం కాదు. అందుకే ప్రభుత్వ డిజీలాకర్‌లో సేఫ్‌గా దాచుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news