టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి… ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం అందుతోంది. న్యూమోనియా తో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి… ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. న్యూమోనియా వ్యాధి కారణంగా ఆయన శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారని… సమాచారం అందుతోంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి కి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై సమీక్ష చేస్తున్నారు. సిరివెన్నెల త్వరగా కోలుకునేలా ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి త్వరగా కోలుకునీ.. ఎప్పటిలాగే ఉండాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. కాగా న్యూమోనియా తో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ని ఈనెల 24వ తేదీన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు.ఇది ఇలా ఉండగా సిరి వెన్నెల సీతారామశాస్త్రి.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోనే కాకుండా.. ఇతర భాషలలొ ఎన్నో పాటలు రాసి.. ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.