లిక్కర్ పాలసీ తయారీలో కీలకపాత్ర సిసోడియాదే : న్యాయవాది

-

మనీశ్ సిసోడియాను నిన్న ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… కావున ఈ మేరకు ఈడీ అధికారులు కోర్టులో సిసోడియాను హాజరు చేయడం జరిగింది. ప్రస్తుతం స్పెషల్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా తరఫున న్యాయవాదులు దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తుండగా, ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు చేపడుతున్నారు. విజయ్ నాయర్, సిసోడియా, కవిత తదితరులు లిక్కర్ స్కాంకు కుట్ర పన్నారని ఈడీ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ దాదాపు రూ.100 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఢిల్లీలో 30 శాతం మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూప్ కు ఇచ్చారని తెలిపారు.

కవితను విజయ్ నాయర్ కలిశారని, లిక్కర్ పాలసీ ఎలా ఉందో చూపాలని విజయ్ ని కవిత అడిగారని వెల్లడించారు ఈడీ న్యాయవాది. సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహరించారని పాలసీ విధానాలు, జీఓఎం నివేదికను మంత్రుల కన్నా రెండ్రోజుల ముందే కవితకు బుచ్చిబాబు ఇచ్చారని వెల్లడించారు. ఇండో స్పిరిట్స్ కంపెనీకి ఎల్1 లైసెన్స్ ఇప్పించడంలో సిసోడియా పాత్ర ఉందని ఈడీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీ తయారీలో కీలకపాత్ర మనీశ్ సిసోడియాదేనని అని తెలిపారు . లిక్కర్ వ్యాపారం మొత్తం కొందరికే కట్టబెట్టారని, లిక్కర్ దందాలో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని పేర్కొన్నారు. 12 శాతం మార్జిన్ తో హోల్ సేల్ విక్రయదారులకు లాభం చేకూరేలా పాలసీలో మార్పులు చేశారని న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version