CWC : సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామాలు చేయవద్దంటూ నినాదాలు

-

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాసేపటికే ప్రారంభం అయింది. ఈ సమావేశానికి హాజరైన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఐదు రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్లు, ఐదు రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు హాజరు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది.

మీటింగ్ కి అందుబాటులో లేని మెంబర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయ్యారు. ముఖ్యంగా పంజాబ్లో ఓటమి, అధికారం చేజారిపోవడానికి గల కారణాలను సమావేశంలో చర్చించనున్నారు నేతలు. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖాండ్ అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఎన్నికల ఫలితాల బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ పార్టీ పదవులకు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన పార్టీ కార్యాలయం 24 akbar road కి పెద్ద ఎత్తున గాంధీ నీ కుటుంబ మద్దతు దారులు, యూత్ కాంగ్రెస్ లీడర్లు నినాదాలు చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ రాజీనామా చేయవద్దంటూ పార్టీ కార్యాలయం ముందు నినాదాలు చేస్తున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version