AUS vs SA :ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం … సొంతగడ్డపై తేలిపోయిన సఫారీలు !

-

ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన ఈ రోజు బ్లోమ్ ఫౌంటెన్ వేదికగా జరుగుతున్న మొదటి వన్ డే లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా అందుకు తగిన విధంగానే బౌలింగ్ లో చెలరేగి సౌత్ ఆఫ్రికా కు చెమటలు పట్టించింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో పూర్తిగా తేలిపోగా ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ ఆడిన సఫారీలు 222 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. మొదటి బంతి నుండి ఆస్ట్రేలియా బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మందకొడిగా సాగిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చివరికి అంత స్కోర్ అయినా చేస్తుంది అని ఎవరూ ఊహించి ఉండరు. కానీ కెప్టెన్ బావుమా ఒక్కడే చివరి వరకు క్రీజులో నిలబడి ఆ మాత్రం స్కోర్ రావడంలో సహాయం చేశాడు. ప్రపంచ కప్ కు ముందు ఈ విధమైన ప్రదర్శన సౌత్ ఆఫ్రికా నుండి ఎవ్వరూ ఊహించి ఉండరు.

ఇక ఈ స్వల్ప లక్ష్యం ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా లాంటి జట్టుకు సరిపోతుందా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ రబడా, ఎంగిడి మరియు శంసి లతో పటిష్టంగానే ఉన్నప్పటికీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version