త్వరలో బిగ్‌బాస్ సీజన్-6.. వీటిపై స్పెషల్ ఫోకస్?

-

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్‌బాస్ కూడా ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఇప్పుడు సీజన్-6 కోసం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో బిగ్‌బాస్ షోకు భారీ రెస్పాన్స్ ఉంది. అయితే సీజన్-6కు సంబంధించి ప్రోమోలు, లోగోలు విడుదల చేసింది బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్.

bigg-boss-6
bigg-boss-6

ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన బిగ్‌బాస్ సీజన్-5 ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ సారి బిగ్‌బాస్ ప్రత్యేక శ్రద్ధ చూపనుంది. కంటెస్టెంట్ల ఎంపిక, షో నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. అయితే సీజన్-6కి కూడా హీరో నాగార్జున మరోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే సీజన్-6 ఎప్పుడు ప్రారంభమవుతోందనే విషయాన్ని మేనేజ్‌మెంట్ వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news