IPL 2022 : ఐపీఎల్ 2022 మ్యాచ్‌ల‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమతి!

-

ఏపీఎల్‌ 2022 కోసం క్రికెట్‌ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి ఆరంభంలో జరిగే మెగా వేలంతో.. ఈ ఏడాది ఏపీఎల్‌ సంబురం షూరూ కానుంది. అయితే.. కరోనా కారణంగా మ్యాచ్‌ లు ఇండియాలోనే జరుగుతాయా.. ఏక ఒక వేళ జరిగితే.. స్టేడియాల్లోకి ప్రేక్షకును అనుమతి ఇస్తారా… అనుమతి ఇస్తే.. ఎంత మందికి అనుమతి ఇస్తారు ఇలా చాలా ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే.. దీనిపై బీసీసీఐ వర్గాల నుంచి ఓ క్లారిటీ వస్తోంది.

ఈ సారి ఐపీఎల్‌ మ్యాచ్‌ కు ప్రేక్షకులను కూడా అనుమతించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం అందుతోంది. అయితే.. ఇది లీగ్‌ జరిగే సమయంలో ఆయా వేదికలు ఉండే రాష్ట్రాల్లో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యను బట్టి ఎంత మందిని అనుమతించాలనే విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందట. ప్రస్తుతం మాదిరిగానే.. కరోనా కేసులు తగ్గితే.. మ్యాచ్‌ లకు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించే ఆలోచనణలో బీసీసీఐ ఉందని టాక్‌. లీగ్‌ సమయంలో కరోనా కేసులు భారీగా తగ్గితే.. ఆ సంఖ్య మరింత పెరుగనుంది. ఒక వేళ తగ్గకుండా పెరిగితే.. ప్రేక్షకులను అనుమతించకుండా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version