సుగంధ ద్రవ్యాలు గుండెకి చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు. మనదేశంలో ఆహారంలో భాగంగా సుగంధ ద్రవ్యాలని చాలా విరివిగా తీసుకుంటారు. ఐతే అవి చేసే మేలు గురించి ఈ రోజు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క..
ఆదివారం వచ్చిందంటే మటన్ చికెన్ లు చాలా కామన్. ఆ టైమ్ లో అందులో దాల్చిన చెక్క వేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ముఖ్యంగా బిర్యానీల్లో దాల్చిన చెక్క బాగా వాడతారు. దీనిలో ఉండే యాంటీయాక్సిండెంట్ల కారణంగా అనేక సమస్యల నుండి బయటపడటమే గాక, గుండెకి సంబంధించిన సమస్యలని తగ్గిస్తుంది.
ఏలకులు
మన ఇళ్ళలో ఎక్కువ మంది ఇలాచీ అని పేరుతో పిలుస్తారు. ఇది ఆహారం ద్వారా కంటే దీనితో టీ తయారు చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఏలకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. వీటి కారణంగా శరీరంలో రక్తం గడ్డకుండా రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. తద్వారా గుండె సురక్షితంగా ఉంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అంతే కాదు రక్తంలో చక్కెర నియంత్రణకి తోడ్పడుతుంది.
ఆవాలు
ఒకానొక అమెరికా అధ్యయనం ప్రకారం ఆవాల నూనెని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పూర్తిగా తగ్గుతాయట. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణని మెరుగు పరచడంతో పాటు, రక్తంలో చక్కెర నిల్వలని తగ్గిస్తాయి. చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచడానికి ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది.సో.. ఇదండీ, మీ ఆహరంలో భాగంగా ఈ సుగంధ ద్రవ్యాలు వాడుతున్నారో లేదో చెక్ చేసుకోండి.