ArrestKohli : విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాల్సిందే !

-

తన ఫేవరెట్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాలను దూషించాడనే కారణంతో స్నేహితుడిని కొడవలితో అతికిరాతకంగా నరికి చంపేశాడు తమిళనాడుకు చెందిన ఓ క్రికెట్ అభిమాని. గత గురువారం చోటు చేసుకున్నట్లు చెబుతున్న ఈ ఘటనలో నిందితుడు, చనిపోయిన వ్యక్తి ఇద్దరు మంచి స్నేహితులని తెలుస్తోంది.

వీరిద్దరూ మద్యం సేవిస్తుండగా క్రికెట్ గురించి చర్చ వచ్చిందని, ఈ సందర్భంగా మృతుడు, క్రికెటర్లు రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని బూతులు తిట్టాడని సమాచారం. తన అభిమాన క్రికెటర్లను తిట్టడాన్ని సహించలేకపోయిన నిందితుడు, తన స్నేహితుడిని కొడవలితో అతికిరాతకంగా నరికి చంపాడని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనలో విరాట్ కోహ్లీ తప్పు ఉందని, అతని ఫ్యాన్స్ చాలా ఎక్కువ చేస్తానని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు విరాట్ కోహ్లీని అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వరుసగా పోస్టులు పెడుతున్నారు నేటిజన్స్.

Read more RELATED
Recommended to you

Latest news