ఐసీసీ మహిళా ప్రపంచ కప్ లో నేడు ఆసక్తికర పోరు జరగుతుంది. ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టుతో భారత ఉమెన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కీలక మైన టాస్ నెగ్గి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత ఉమెన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనున్నారు. కాగ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. నాలుగు మ్యాచ్ లకు నాలుగు మ్యాచ్ లు విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
కానీ భారత ఉమెన్స్ జట్టు.. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడినా.. అందులో రెండు ఓటమి చెంది.. మరో రెండింటి విజయం సాధించింది. దీంతో భారత్ ఉమెన్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కాగ అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును భారత్ ఓడించడం సవాల్ తో కూడిన అంశమే అని చెప్పాలి. కాగ ఈ మ్యాచ్ లు ఇరు జట్లు ఇలా ఉన్నాయి.
భారత ఉమెన్స్ జట్టు :
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్( కెప్టెన్ ), హర్మన్ ప్రీత్ కౌర్, స్నేహ రాణా, రిచా ఘోష్( వికెట్ కీపర్ ), పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్
ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు :
అలిస్సా హీలీ( వికెట్ కీపర్ ), రాచెల్ హేన్స్, మెగ్ లానింగ్( కెప్టెన్ ), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీగ్ గార్డనర్, జెస్ జోనాసెన్, అలనా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్