ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్ ఖరారు

-

ఐపీఎల్ ముగియగానే మరో క్రికెట్ సమరానికి రంగం సిద్ధం అయింది. హో సిరీస్ కు దక్షిణాఫ్రికా ఇండియాకు రానుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ కు షెడ్యూల్ ఖరారైంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ లో ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 మ్యాచులు జరుగనున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. ఇరు జట్లు మధ్య 5 టీ20 మ్యాచులు జరుగనున్నాయి.

మొదటి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9 తేదీన, రెండో టీ20 కటక్ వేదికగా జూన్ 12న, మూడో టీ20 వైజాగ్ వేదికగా జూన్ 14న, నాలుగో టీ20 రాజ్ కోట్ వేదికగా 17న, ఐదో టీ20 బెంగళూర్ వేదికగా జూన్ 19న జరుగనుంది. ఇరు జట్ల మధ్య 5 టీ20 మ్యాచులు జరుగుతుండటంతో ఫ్యాన్స్ కు ఇక పండగే. ఐపీఎల్ ముగియగానే మరో టీ20 సమరం జరనుంది. ఇటు ఇండియా, అటు సౌతాఫ్రికా రెండు జట్లు సమజ్జీవులుగా ఉన్నాయి. ఈ రెండు పెద్ద జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version