వెస్టిండీస్ తో టీ 20 సమరానికి టీమిండియా సిద్ధం అయింది. నేటి నుంచి టీ 20 సిరీస్ ప్రారంభ కానుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. కోల్‌కత్తలోని ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో టీ 20 ఈ నెల 18, మూడో టీ 20 ఈ నెల 20న జరగనున్నాయి. వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసింది. తాజా గా టీ 20 సిరీస్ కూడా ప్రారంభం కానుంది. కాగ ఈ సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని భారత్ జట్టు ప్రయత్నింస్తుంది.
కాగ వచ్చే ఏడాది టీ 20 ప్రపంచ కప్ వస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ కు ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రపంచ కప్ కు భారత్ సిద్ధం కావడానికి ఈ సిరీస్ మంచి అవకాశంగా ఉండనుంది. జట్టు లోపాలను సరి చేసుకోవడం తో పాటు ఆటగాళ్లపై ప్రయోగాలు చేయడం వంటి సవాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ పై ఉండనున్నాయి.
అలాగే ఈ టీ 20 సిరీస్ పై ఐపీఎల్ మెగా వేలం ఎఫెక్ట్ కూడా చూపే అవకాశం ఉండనుంది. మెగా వేలంలో కొంత మంది ఆటగాళ్లు రికార్డు ధర పలకగా.. మరి కొందరు స్వల్ప ధరకే అమ్ముడుపోయారు. మరి కొందరు అన్ సోల్డ్ గా అయ్యారు. దీని ప్రభావం ఈ సిరీస్ పై చూపకుండా ఉండాలని కెప్టెన్ రోహిత్ ఇప్పటికే ఆటగాళ్లను కూడా హెచ్చరించారని తెలుస్తోంది.