ధోనీని ఔట్‌ చేయడమే టర్నింగ్‌ పాయింట్‌.. యశ్‌కే ఈ అవార్డు: డుప్లెసిస్

-

ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ లో శనివారం రోజున బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఆటలో కీలకమైన ధోనీ వికెట్ గురించి బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాట్లాడాడు. ఆర్సీబీ ఆటగాడు యశ్‌.. కీలకమైన ధోనీ వికెట్‌ను పడగొట్టాడు. అక్కడ నుంచి బెంగళూరు విజయం వైపు కొనసాగింది. ఆ ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్‌.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ప్రదర్శన చేసినప్పటికీ యశ్‌కు కాకుండా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన డుప్లెసిస్‌కు (54) అవార్డు దక్కింది. మ్యాచ్‌ అనంతరం దానిని యశ్‌కు అంకితం చేస్తున్నట్లు డుప్లీ చెప్పాడు.

‘‘ఎంఎస్ ధోనీ క్రీజ్‌లో ఉంటే ఎంతటి టార్గెట్‌ అయినా కరిగిపోతుంది. ఇలాంటి ఇన్నింగ్స్‌లను ఎన్నో ఆడాడు. కానీ మా బౌలర్లు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును యశ్‌ దయాల్‌కు ఇచ్చేస్తా. ధోనీ వంటి హార్డ్‌ హిట్టర్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు కుర్రాడు ఇలా బౌలింగ్‌ చేయడం అభినందనీయం. పేస్‌ను తగ్గించి వైవిధ్యంగా బంతులేయడం సరైన నిర్ణయం. తొలి బంతినే యార్కర్‌గా వేద్దామని ప్రయత్నించాడు. కానీ, అది కుదరలేదు. దీంతో స్లో డెలివరీలే బెస్ట్‌ అని అటుగా ప్రయత్నించాడు. ధోనీని ఔట్ చేయడంతో మేం ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చేశాం. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలవడం మాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. నాకౌట్‌లోనూ ఇదే దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం’’ అని డుప్లెసిస్ వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version