హార్ధిక్ పాండ్యా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యోయో టెస్టులో పాస్

-

ఐపీఎల్ కు ముందు హార్ధిక్ పాండ్యా అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఇప్ప‌టి వ‌ర‌కు ఫిట్ నెస్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న హార్ధిక్ పాండ్యా.. టీమిండియా కు దూరం అయ్యాడు. ఫిట్ నెస్ కోల్పోవ‌డంతో త‌న ఫామ్ కూడా కోల్పోయాడు. దీంతో టీమిండియాలో ఆడ‌టానికి అవ‌కాశాలు రాలేదు. కాగ ఫిట్ నెస్ తో పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న హార్ధిక్ పాండ్యాను గుజ‌రాత్ టైటాన్స్ తీసుకుని ఏకంగా కెప్టెన్ గా కూడా ప్ర‌క‌టించింది.

అయితే గ‌త కొద్ది రోజుల నుంచి హార్ధిక పాండ్యా.. ఐపీఎల్ 2022 ఆడ‌టం అనుమానమే అని ప‌లువురు అభిప్రాయ ప‌డ్డారు. బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఒక ఆట‌గాడు ఫిట్ నెస్ ప‌రీక్షల‌లో నెగ్గితేనే.. ఐపీఎల్ ఆడాలి. కాగ హార్ధిక్ పాండ్యా.. ఫిట్ నెస్ ప‌రీక్షల్లో నెగ్గుతాడా అనే ప్ర‌శ్న చాలా మందికి వ‌చ్చింది. కానీ నేడు హార్ధిక్ పాండ్యా కు నిర్వ‌హించిన ఫిట్ నెస్ ప‌రీక్షలు, యోయో టెస్ట్ ల్లో పాస్ అయిన‌ట్టు తెలుస్తుంది.

బెంగ‌ళూర్ లోని ఎన్‌సీఏ లో హార్ధిక్ పాండ్యాకు ఫిట్ నెస్ ప‌రీక్షలు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కాగ ఈ ప‌రీక్షలో హార్ధిక్ పాండ్యా.. 135 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన‌ట్టు కూడా తెలుస్తుంది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి తాను ఈ ఐపీఎల్ లో స‌రి కొత్త‌గా క‌నిపిస్తాన‌ని హార్ధిక్ పాండ్యా చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version