రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్రేక్ చాలా అవసరమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.ఐపీఎల్ 2022 సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ చేసిన పరుగులు కేవలం 119 మాత్రమే.ఈ సీజన్లో అతని సగటు 19.83 కాగా..అత్యధిక స్కోరు 48 పరుగులు మాత్రమే.దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్ కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.లక్నో సూపర్ జేంట్స్ తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.
ఫాస్ట్ బౌలర్ చమీరా విసిరిన బంతిని పాయింట్ దిశగా హిట్ చేయబోయిన విరాట్ కోహ్లీ.. ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కాడు.ఈ సీజన్లో కోహ్లీ డకౌట్ గా వెనుదిరగడం ఇదే మొదటిసారి.కానీ 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్ గా కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనుదిరగడం మాత్రం ఇది నాలుగోసారి.మొత్తంగా తాజా సీజన్లో కోహ్లీ చేసిన పరుగులు అన్ని పరిశీలిస్తే? వరుసగా..41, 12, 5, 48, 1, 12, 0 మాత్రమే.ఇలా తీవ్ర ఒత్తిడి మధ్య తన క్రికెట్ కెరీర్ ని అతడు కోల్పోకూడదు అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.