IPL 2022 : ఐపీఎల్ లో రోహిత్ అత్యంత చెత్త రికార్డు..ఏకంగా 61 సార్లు

-

ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. శనివారం లక్నోతో జరిగిన మ్యాచ్‌ లో రోహిత్‌ శర్మ 6 పరుగుల సింగిల్‌ డిజిట్‌ కే అవుట్‌ అయ్యాడు. తద్వారా ఐపీఎల్‌ లో అత్యధిక సార్లు సింగిల్‌ డిజిట్‌ కే ఔట్‌ అయిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. దినేష్‌ కార్తీక్‌ ను అధిగమించాడు రోహిత్‌ శర్మ.

ఇప్పటి వరకు కార్తీక్‌ 60 సార్లు ఐపీఎల్‌ లో సింగిల్‌ డిజిట్‌ కే అవుట్‌ అయ్యాడు. తాజాగా.. 61 సింగిల్‌ డిజిట్‌ లు నమోదు చేసుకున్న రోహిత్‌.. ఆ రికార్డు తన పేరిట వేసుకున్నాడు. కాగా.. నిన్నటి ఓటమితో.. ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ కు మ‌రో సారి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే ఐదు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉన్న ముంబై.. తాజా గా లక్నో పై ఓడింది. దీంతో డ‌బుల్ హ్యాట్రిక్ ఓట‌ములు చ‌వి చూసిన ఐపీఎల్ జ‌ట్టుగా రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news