ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. సూపర్ ఓవర్లో 11పరుగులు చేసిన బెంగళూరు ముంబై ఇండియన్స్ ని 7పరుగులకే కట్టడి చేయగలిగింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, ఇషాన్ కిషన్ అద్భుత పర్ ఫార్మెన్స్ తో బెంగళూరు స్కోరుని సమం చేయగలిగింది. ఒక పరుగు తేడాలో సెంచరీ చేజార్చుకున్న ఇషాన్ కిషన్ 58బంతులో రెండు ఫోర్లు, 9 సిక్సర్లు బాది 99 పరుగులు చేయగలిగాడు.
ఐతే సెంచరీని మిస్ చేసుకున్న ఇషాన్ కిషన్ ని సూపర్ ఓవర్లో ఎందుకు దించలేరని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 9 సిక్సర్లతో బెంగళూరుకు ముచ్చెమటలు పట్టించిన ఆటగాడిని సూపర్ ఓవర్లో పంపిస్తే విజయం దక్కి ఉండేది కదా అని చాలా మంది అభిప్రాయం. ఐతే ఈ విషయమై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ, నిజానికి సూపర్ ఓవర్లో ఇషాన్ కిషన్ కే దింపాలని భావించాము. ఈ విషయం అతనికి కూడా చెప్పాము. కానీ అతను బాగా అలసిపోయాడు. ఆ టైమ్ కి బ్యాటింగ్ చేసే పరిస్థితిలో లేడు. అందువల్లే ఇషాన్ కిషన్ ని సూపర్ ఓవర్లో పంపలేకపోయామని చెప్పుకొచ్చాడు.