pakistan- west indies: మాస్కులు పెట్టుకుని క్రికెట్ ఆడారు..ఎందుకో తెలుసా..?

-

శ్రీలంక క్రికెట్ టీంపై పాకిస్తాన్ లో దాడి జరిగిన తర్వాత అక్కడ ఏ దేశం కూడా క్రికెట్ ఆడేందుకు ముందుకు రాలేదు. అయితే పాక్ లో క్రికెట్ ఆడేందుకు వెస్టిండీస్ టీం ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాాజాగా మరోసారి వెస్టిండీస్ టీం పాక్ లో పర్యటిస్తోంది. అయితే తాజాగా మూడు మ్యాచుల వన్డే సిరీజ్ ను పాకిస్తాన్ సొంతం చేసుకుంది. వరసగా మూడు మ్యాచుల్లో వెస్టిండీస్ టీం ఓడిపోయి వైట్ వాష్ కు గురైంది. మూడో మ్యాచులో కూడా వెస్టిండీస్ విఫలం అయింది. 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. 

ఇదిలా ఉంటే మూడో వన్డే జరిగిన ముల్తాన్ లో క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మూతికి మాస్కులు, సన్ గ్లాసెస్ పెట్టుకుని ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముల్తాన్ లో ఇసుక తుఫాన్ రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. మాస్కులు ధరించి బౌలింగ్, ఫిల్డింగ్ చేస్తున్న దుశ్యాలు నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి. ఇసుక తుఫాన్ వల్ల ఎంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఈ మ్యాచ్ లో ముందుగా 269 పరుగులు చేయగా.. 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓడిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news