టీమిండియాయా కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్

హైదరాబాదీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్ గా వ్యవహరించబోతున్నాడు. ఈనెలాఖరులో టీమ్ ఇండియా ఐర్లాండ్ తో రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు వి.వి.ఎస్.లక్ష్మణ్ హెడ్ కోచ్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం భారత జట్టు సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఐర్లాండ్ తో జరగనున్న టి20 సిరీస్ కు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది.

అయితే వివిఎస్ లక్ష్మణ్ తో పాటు.. సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, మునిష్ బాలీ కూడా ఐర్లాండ్ టూర్ కు వెళ్లనున్నారు. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా కోటక్ వ్యవహరించనున్నాడు. మనీష్ బాలి ఫీల్డింగ్ కోచ్ గా, సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.