ఏపీలోని గిరిజన ప్రాంతాలు మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చాయి…అయితే కాంగ్రెస్ కనుమరుగయ్యాక…గిరిజనులు వైసీపీకి సపోర్ట్ గా ఉంటూ వచ్చారు. వైఎస్సార్ మీద అభిమానంతో..గిరిజనులు వైసీపీకి మద్ధతు తెలుపుతూ వచ్చారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే…ఏజెన్సీ నియోజకవర్గాలు వైసీపీకి అండగా నిలిచాయి. ముఖ్యంగా అరకు పార్లమెంట్ ని వైసీపీ గెలుచుకోగా, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 వైసీపీ గెలుచుకుంది. పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం స్థానాల్లో వైసీపీ గెలవగా, ఒక్క పార్వతిపురంలో మాత్రం టీడీపీ గెలిచింది.
అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు…ఇక 2019 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క సీటు కూడా టీడీపీ గెలుచుకోలేదు…ఇక తర్వాత పంచాయితీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో కూడా వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఇలా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతుంది..ఎక్కడకక్కడ వైసీపీకి పోటీగా టీడీపీ వస్తుంది.
ఇదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా టీడీపీ పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది…ఏజెన్సీ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పార్వతిపురం, కురుపాం, పాడేరు, రంపచోడవరం లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది…ఆ నాలుగు చోట్ల టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. ఈ పరిస్తితులని బట్టి చూస్తే ఏజెన్సీలో ఈ సారి వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి.
కాకపోతే ఇక్కడ వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జగన్ ఇమేజ్…అక్కడి ప్రజలు జగన్ పట్ల అభిమానంతో ఉంటారు…ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలని కాకుండా జగన్ ని చూస్తే…మళ్ళీ ఏజెన్సీలో వైసీపీకి తిరుగుండదు…లేదంటే అంతే సంగతులు.