టీం ఇండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం అనేది ప్రతీ బౌలర్ కి ఒక కల అనేది వాస్తవం. అతని వికెట్ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అసలు కోహ్లీ వికెట్ దక్కితే చాలు మ్యాచ్ తమదే అనే భావన లో ప్రత్యది టీం ఉంటుంది. కోహ్లీ విషయంలో ఎన్నో వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు. అయితే అతనికి మాత్రం లెగ్ స్పిన్నర్ ఫోబియా స్పష్టంగా ఉందని అంటున్నారు.
నూజిలాండ్ తో తొలి వన్డేలో కోహ్లీ అవుట్ అయిన తీరే అందుకు నిదర్శనం. కోహ్లీ వన్డే కెరీర్ చూస్తే విరాట్ కోహ్లీ 185 అవుట్ కాగా 17 సార్లు లెగ్ స్పిన్నర్లకు తన వికెట్ కోల్పోయాడు. అలాగే, విరాట్ కోహ్లీ వన్డేల్లో చివరి 4 అవుట్లలో 3 లెగ్ స్పిన్నర్ల ఖాతాలోనే చేరాయి. న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోదీ బౌలింగ్ లో కోహ్లీ తన వికెట్ పారేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా కోహ్లీ వికెట్ ని ఎక్కువ సార్లు తీసాడు.
అదే విధంగా ఆసిస్ యువ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా కూడా కోహ్లీ వికెట్ ని ఎక్కువ సార్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా లెగ్ స్పిన్నర్లకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో తన వికెట్ పారేసుకునే పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ తన 58 వ వన్డే హాఫ్ సెంచరీని తొలి వన్డేలో నమోదు చేసాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టుని ఆదుకున్నాడు కోహ్లీ.