గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ – కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!

-

ఐపిఎల్ సీజన్ 16 ఎంతో అంగరంగ వైభవంగా వేల ప్రేక్షకుల ముందు మార్చ్ 31 సాయంత్రం మొదలైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై మరియు గుజరాత్ లు పోటీ పడగా గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ గుజరాత్‌ ప్లేయర్‌ విలియమ్సన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై బ్యాటర్‌ రుతురాజ్‌ కొట్టిన సిక్సును ఆపే ప్రయత్నంలో.. ఫోర్‌ గేట్‌ లో గుజరాత్‌ ప్లేయర్‌ విలియమ్సన్‌ కింద పడ్డాడు.

దీంతో గుజరాత్‌ ప్లేయర్‌ విలియమ్సన్‌ కాలు కండరాలు పట్టేశాయి. దీంతో విలియమ్సన్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లను జియో సినిమా యాప్ ద్వారా ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా ప్రసారం చేస్తున్నారు. అందుకే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి దేశ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మన దేశంలో ఒక యాప్ ను ఎక్కువ మంది కేవలం ఒక రోజులో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ గా జియో సినిమా రికార్డ్ సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version