ఐపీఎల్: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్..

-

భారత క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ గా పేరు గాంచిన సచిన్ టెండూల్కర్ పై ఎన్నో రికార్డులున్నాయి. బ్యాటింగ్ లో సచిన్ చేయని రికార్డు లేదంటే అతిశయోక్తి కాదేమో. వన్డే ఇంటర్నేషనల్ అయితేనేమీ, టెస్టుల్లో అయితేనేమీ, ఐపీఎల్ లో అయితేమీ సచిన్ రికార్డు లేకుండా క్రికెట్లో ఏ ఫార్మాటూ లేదు. ఐతే తాజాగా సచిన్ రికార్డు బద్దలయ్యింది. ఐపీఎల్ 13వ సీజన్లో జరుగుతున్న కింగ్స్ ఎలెవన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో సచిన్ రికార్డు బద్దలైంది.

పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రికార్డు బద్దలు కొట్టి తన పేర లిఖించుకున్నాడు. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2వేల పరుగులు సాధించిన భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని సచిన్ టెండూల్కర్ 63ఇన్నింగ్సుల్లో సాధించగా, కేఎల్ రాహుల్ కేవలం 60ఇన్నింగ్సుల్లో అందుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news