ఆ టార్గెట్ మాత్రమే మిగిలుంది.. గోల్డెన్ విజయంపై నీరజ్ చోప్రా

-

ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరోసారి హిస్టరీ క్రియేట్ చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దాడిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. తాజాగా.. ఇప్పటి వరకు ఏ భారత అథ్లెట్‌కు సాధ్యం కాని ప్రపంచ ఛాంపియన్‌ హోదాను అందుకున్నాడు. క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఒకే ఒక్క త్రోతో ఫైనల్​కు దూసుకెళ్లిన నీరజ్​.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాడు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయినా.. రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ… ఈ బంగారు పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు నీరజ్ చోప్రా తెలిపాడు. నీరజ్ ఎన్ని పోటీలు గెలిచినా.. రికార్డులు తిరగరాసినా.. ఓవైపు క్రీడాభిమానులకు.. మరోవైపు నీరజ్​ చోప్రాకు ఒకే ఒక వెలితి ఉంది. అదేంటంటే.. 90 మీటర్ల లక్ష్యం చేరుకోవడం. ఇప్పటివరకు నీరజ్.. తన బల్లెంను 90 మీటర్ల దూరాన్ని విసరలేకపోయాడు. చాలా సార్లు దీనిపై సోషల్​ మీడియాలో చర్చ కూడా జరిగింది. తాజాగా ప్రపంచ ఛాంపియన్​ఫిప్​ విజయం గురించి మాట్లాడుతూ.. త్వరలోనే కచ్చితంగా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version