వాషింగ్టన్ సుందర్ దెబ్బకు న్యూజిలాండ్ 259కే ఆలౌట్..!

-

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 259 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌలింగ్ వేయడంతో న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు తప్పలేదు. ఒక దశలో 197/4తో చాలా పటిష్టంగా ఉన్న కివీస్ ను సుందర్ చావు దెబ్బ కొట్టాడు.

ఈ మ్యాచ్ లో మొత్తం 7 వికెట్లు తీసి ప్రత్యర్థుల పతనాన్ని శాసించారు. బ్లాక్ క్యాప్స్ లో డెవాన్ కాన్వె(76), రచిన్ రవీంద్ర(65), మిచెల్ సాట్నర్ 33 పరుతులతో  రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా పెద్దగా స్కోరు చేయలేకపోయారు. ఓపెనర్లు లాథమ్ ను తొలుత అశ్విన్ LBW తో వికెట్ల పతనం ప్రారంభం అయింది.  కాన్వె, విల్ యంగ్ వికెట్లు కూడా  అశ్విన్ తీశాడు.  మిగతా వికెట్లు అన్నింటిని వాషింగ్టన్ సుందర్ పడగొట్టడం విశేషం. కొద్ది సేపట్లోనే టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version