రెండు వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు..!

-

భారత్ పాకిస్తాన్ మధ్య ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రసవత్తరంగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లకు తొలి వికెట్ ను కోల్పోయింది. 41-1 వికెట్ కోల్పోయింది. 41 పరుగుల వద్ద అబ్దుల్లా షఫిక్ (20) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. హైదరాబాద్ కి చెందిన బౌలర్ మహ్మద్ సిరాజ్ lbw చేశాడు.

అదేవిధంగా 12.3 ఓవర్ల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఇమామ్ హుల్ హక్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కే.ఎల్. రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో పాకిస్తాన్ భారీ పరుగులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ పాక్ జట్టు మాత్రం పరుగుల వరద కురిపిస్తూనే ఉంది. 12.5 ఓవర్లకు పాకిస్తాన్ జట్టు 73 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version