IND VS SA : సినిమా హీరోల్లా మారిన కోహ్లీ-రోహిత్‌! పోటాపోటీగా భారీ కటౌట్లు

-

IND VS SA :  మరో 20 రోజుల్లో టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీం ఇండియా దక్షిణాఫ్రికా తో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ తొలి టీ20 జరగనుంది. తొలి టీ 20 నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ కటౌట్లు ఏర్పాటు చర్చనీయాంశమైంది.

బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు, కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్, నువ్వా నేనా అన్న రీతిలో కటౌట్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలో దారిలో ఈ ఉదయం విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కోహ్లీ భారీ కటౌట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

కెప్టెన్సీ లేకున్నా విరాట్ క్రేజ్ తగ్గలేదని అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేశారు. విరాట్ కోహ్లీ కటౌట్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి కాస్త నిరాశకు గురైన రోహిత్ శర్మ ఫ్యాన్స్ గంటల వ్యవధిలోనే కోహ్లీ కటౌట్ ను మించిన రోహిత్ శర్మ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది కూడా గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలోనే ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news