Ind vs Sl: ఇవాళ టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య మూడో వన్డే.. జట్ల వివరాలు ఇవే

-

Sri Lanka vs India, 3rd ODI: ఇవాళ శ్రీలంక వర్సెస్ టీమిండియా జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. మూడవ వన్డేలో భాగంగా ఇవాళ శ్రీలంకతో తలపడనుంది టీం ఇండియా. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చావో రేవోగా మారింది. కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి వన్డే మ్యాచ్ టై అయింది. రెండవ మ్యాచ్లో టీమిండియా దారుణంగా ఓటమిపాలైంది. కాబట్టి సిరీస్లో నిలవాలంటే ఇవాల్టి మ్యాచ్లో కచ్చితంగా టీమిండియా గెలవాలి. లేకపోతే సిరీస్ కోల్పోవడం గ్యారంటీ.

Sri Lanka vs India, 3rd ODI

రెండవ వన్డే మ్యాచ్లో… బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైంది టీమిండియా. రోహిత్ శర్మ రాణించిన మిగతా బ్యాటర్లు ఎవరు సరిగా ఆడలేదు. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేదించలేక టీమిండియా ఓడిపోయింది. ఇక ఇవాళ సిరీస్ సమం చేయాలంటే కచ్చితంగా టీమిండియా గెలవాలి. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ కే.ఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆడితే టీమిండియా కచ్చితంగా గెలుస్తుంది. అటు గౌతమ్ గంభీర్ పైన కూడా ప్రత్యేక దృష్టి ఉంది. ఆయన కోచ్గా… వచ్చిన తర్వాత ఇది మొదటి వన్డే సిరీస్ కావడం గమనార్హం. ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోతే గంభీర్ పైన తీవ్ర ఒత్తిడి ఉండే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version