Suryakumar Yadav: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ నుంచి 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా హార్ట్ బ్రేక్ సింబల్ తో సూర్య కుమార్ చేసిన పోస్టు ఇదే చెబుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీలమండ గాయం కారణంగా జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్.
ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు సూర్య కుమార్ యాదవ్. అయితే ఈసారి ఐపీఎల్ 2024 సూర్యకుమార్ ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి క్షణంలో జాతీయ క్రీడ అకాడమీ సూర్యకుమార్ యాదవ్ ను ఆడకూడదని కండిషన్ పెట్టిందట. ఇంక నువ్వు ఫిట్నెస్ సాధించాలని… ఇలాంటి సమయంలో క్రికెట్ ఆడరాదని వెల్లడించిందట. దీంతో హార్ట్ బ్రేక్ సింబల్ తో తాజాగా సూర్య కుమార్ యాదవ్ పోస్టు పెట్టారట.