ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్లుగానే టీమ్ ఇండియా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ కి అప్పగించారు. వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ లకు చోటు దక్కింది.
గాయాలనుంచి కోల్కున్న వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) లో శిక్షణ పొందుతున్నారు. రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ లకు జట్టులో చోటు కల్పించారు. ఇక శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ లను స్టాండ్ బై ఆటగాళ్లుగా తీసుకున్నారు.
భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.. రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్.