BREAKING : వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ ధరల పెంపు

-

సంక్రాంతికి విడుదలవుతున్న వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు కోసం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకోగా టికెట్ ధరపై గరిష్టంగా 45 రూపాయలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

టికెట్ ధర 70 రూపాయలు పెంచాలని మైత్రి మూవీ మేకర్స్ కోరగా 45 రూపాయలు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు నందమూరి, మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల స్పెషల్‌ షోలకు అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

విడుదల రోజున ఆరో షోలకు పర్మిషన్‌ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం 12న ఉదయం 4 గంటలకే వీరసింహారెడ్డి షోలు పడనున్నాయి. ఆ మరుసటి రోజే అంటే 13న ఉదయం 4 గంటలకే మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య షోలు ప్రారంభం కానున్నాయి. అంటే ఒక రోజు పాటు ఆరు షోలు పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version