వైజాగ్ లోనే డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. టాప్ ఆర్డర్ వైఫల్యం మధ్య ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆశలు కల్పించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.
అయితే..ఈ విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో ద్విశతకం నమోదుచేశారు. మరోవైపు ఇవాళ తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికి అశ్విన్ (20) అవుట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.