శ్రీరామనవమి : భద్రాదికి ఆ పేరు ఎందుకు పెట్టారు ?

-

శ్రీరాముడు అంటే తెలుగునాట అందరికీ గుర్తుకువచ్చేది భద్రాచలం. అయితే ఈ క్షేత్రాన్ని భద్రాదిగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ ఏటా నిర్వహించే శ్రీరామనవమి కళ్యాణం గురించి తెలియని తెలుగు భక్తులు ఉండరు. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రంలో రాముడి కళ్యాణంలో పాల్గొనాలని తపిస్తాడు. అయితే అసలు ఈ భద్రాదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…

స్థలపురాణం ప్రకారం రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారట. భద్ర మహర్షి ఆతిథ్యాన్ని అందుకున్న స్వామి, తాను సీతమ్మను రక్షించిన పిదప, తిరిగి అటువైపుగా వచ్చి పునర్దర్శనాన్ని అందచేస్తానని భద్ర మహర్షికి మాట ఇచ్చారట. అయితే రావణసంహారం తరువాత రాములవారు ఆ మాటే మర్చిపోయి వేరే బాట పట్టారు. కానీ భద్ర మహర్షి మాత్రం రాములవారి కోసం ఎదురుచూస్తూ తపస్సుని ఆచరిస్తూనే ఉన్నారు. రోజులు మారాయి, ఏళ్లు గడిచాయి… రామావతారం సమాప్తి చెందింది. కానీ భద్రుని తపస్సు మాత్రం కొనసాగుతూనే ఉంది.

రామావతారాన్ని చాలించి విష్ణువుగా వైకుంఠంలో ఉన్న రాములవారికి అకస్మాత్తుగా ఓ రోజు భద్రుడు జ్ఞాపకం వచ్చాడు. అంతే సీతాలక్ష్మణసమేతుడై పరుగుపరుగున భ్రదుని కలుసుకునేందుకు దిగివచ్చాడు. భద్రునికి దర్శనమిచ్చిన రాముడు అతని కోరిక మేరకు అక్కడే వెలిశాడు. అదే భద్రాచలం. ఆ తర్వాతి కాలంలో కంచర్ల గోపన్న అదేనండి మన రామదాసుగారు ఇక్కడ దేవాలయం నిర్మించడం, స్వామివారికి నవమి నాడు కళ్యాణం చేయడం ఆనవాయితీగా మారింది. భద్రమహర్షి పేరుతో వెలసిన మహా క్షేత్రమే నేటి భద్రాచలం.

Read more RELATED
Recommended to you

Latest news